telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బందరు పోర్టు నిర్మాణానికి 1000 ఎకరాలు అవసరం …

కెబినెట్‌ నుంచి బందరు పోర్టుకు గ్రీన్ సిగ్నల్‌ లభించడంతో పోర్టు నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ఏపీ మారీ టైమ్‌ బోర్డు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములకు సంబంధించిన లెక్కలు సిద్దం చేస్తుంది మారీటైమ్‌ బోర్డు. తొలి దశ బందరు పోర్టు నిర్మాణానికి సుమారు 1000 ఎకరాలు అవసరమని అంచనా వేసింది. అయితే సముద్రంలో సుమారు 155 ఎకరాల్లో డ్రెడ్జింగ్‌ పనులు ఉన్నాయి. వీలైనంత త్వరగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా కసరత్తులు చేస్తుంది బోర్డు. పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి మూడేళ్ల కాలంలో తొలి దశ పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్దం చేసింది మారీటైమ్ బోర్డ్‌. ఆరు బెర్తులతో తొలి దశలో బందరు పోర్ట్‌ నిర్మాణం. నాలుగు జనరల్‌ కార్గో బెర్తులు, ఒక్కో కోల్‌ బెర్త్‌, కంటైనర్‌ బెర్తుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తుంది బోర్టు. 80 వేల డెడ్‌ వెయిట్‌ టన్నేజ్‌ కెపాసిటీ గల షిప్పులు వచ్చేందుకు అనువుగా బెర్తుల నిర్మాణం చేయనుంది. పోర్టులో గోడౌన్లు, అంతర్గత రోడ్లు, ఇంటర్నల్‌ రైల్‌ యార్డ్‌, సబ్ స్టేషన్‌, పరిపాలనా భవనం వంటి నిర్మాణాల పైనా ఫోకస్ పెట్టింది‌. చూడాలి మరి ఇది ఈపాటికి పూర్తవుతుంది అనేది.

Related posts