అయోధ్య పై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో మంత్రులంతా సమయమనం పాటించాలని ప్రధాని మోదీ కోరారు. బుధవారం ఆయన తన క్యాబినెట్ మంత్రులకు ఈ సూచన చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. అయోధ్య తీర్పును వినయపూర్వకంగా అంగీకరించాలని మోదీ తన క్యాబినెట్ సహచరులకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. తీర్పుపై అనవసర వ్యాఖ్యలు చేయరాదు అని వారికి ఆయన స్పష్టం చేశారు.
స్నేహపూర్వ వాతావరణాన్ని ప్రదర్శించాలన్నారు. గెలుపు, ఓటమి దృష్టితో తీర్పును చూడరాదన్నారు. ఈనెల 17వ తేదీన సీజేఐ రంజన్ గగోయ్ పదవీవిరమణ చేయనున్నారు. అయితే ఈ లోపే అయోధ్య కేసులో గగోయ్ తుది తీర్పును వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
ఇకపై అది అధికారికంగా నీ సమస్య… అల్లుడిపై నాగబాబు షాకింగ్ కామెంట్