telugu navyamedia
రాజకీయ

మ‌సూద్ పై పాకిస్థాన్‌ చర్యలు..ఆస్తుల జ‌ప్తుకు ఆదేశం

European union steps to confirm masud as terrorist
జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది అని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అతనిపై చర్యలు ప్రారంభించింది. మసూద్ ఆస్తులను జప్తు చేయాలని, ఆయన ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. అత‌నిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించింది.  
యూఎన్ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో అమ‌లు చేస్తామ‌ని పాక్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. దానికి అనుగుణంగా ప్ర‌భుత్వ అధికారుల‌ను కూడా ఆదేశించిన‌ట్లు ఇమ్రాన్ ప్ర‌భుత్వం తెలిపింది.  ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌ల‌ను వెంట‌నే అమ‌లు చేస్తామ‌ని పాక్ విదేశాంగ కార్య‌ద‌ర్శి మొహమ్మ‌ద్ ఫైస‌ల్ తెలిపారు.మసూద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Related posts