telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు.

సినీ నటుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ కి రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ పవన్ కి మద్దతు తెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

‘పవన్ కల్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. మెగాస్టార్, అల్లు అర్జున్ తో పాటు ఇటీవలే రామ్ చరణ్, నాని, సీనియర్ హీరో నరేష్, నిర్మాతలు నాగవంశీ, నట్టికుమార్ పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాన్ కి మద్దతు తెలిపారు.

Related posts