telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా పేరు వాడుకుని వర్మ పాపులారిటీ సంపాదిస్తున్నాడు : కేఏ పాల్

KA-Paul

రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందిస్తోన్న చిత్రం `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమా ఈ నెల 29న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో తన డైలాగ్స్‌, ఫొటోలు, వీడియోలు వాడ‌టంపై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కె.ఎ.పాల్ త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త‌న పేరుని వాడుకుని డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ పాపులారిటీని సంపాదిస్తున్నాడ‌ని కె.ఎ.పాల్ అన్నారు. ఈ సినిమా ప‌రంగా ఇప్ప‌టికే సెన్సార్ బోర్డ్‌, లాయ‌ర్ల‌ను మేనేజ్ చేయ‌డానికి వ‌ర్మ‌కు రూ.5 కోట్లు ముట్టాయ‌ని చెప్పిన పాల్‌, తాను న్యాయం కోసం కోర్టుకు వెళ‌తానే త‌ప్ప ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు వెళ్లన‌ని అన్నారు. 2015లో ర‌జినీ కాంత్ అనుమ‌తి లేకుండా ఆయ‌న ఫొటోల‌ను వాడుకుంటే .. అలా వాడుకున్న ఓ సినిమాను నిలిపివేశారని కేఏ పాల్ అన్నారు. క‌మ్మ కులాన్ని అవ‌మానించి రెడ్డి కులాన్ని గొప్ప‌గా చూపారు. ఇలాంటి వివాద‌స్ప‌ద మైన ఓ సినిమాను పంజాబ్‌లో తీస్తే ప్ర‌భుత్వమే ఆ సినిమాను ఆపేసిందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. సినిమాలు లేకుండా రోజూ వ‌ర్మ నా గురించి మాట్లాడుతున్నాడు. ఇక‌పై వ‌ర్మ ఆట‌లు సాగ‌వన్నారు కేఏ పాల్‌.

Related posts