నిడమర్రులో ప్రచారంలో ఉన్న లోకేష్ కు పెనుప్రమాదం తప్పింది. ప్రచారంలో ఉండగా, అక్కడే ఉన్న హోటల్ హోర్డింగ్ హఠాత్తుగా లోకేష్ పై పడింది. అయితే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
లోకేష్ మంగళగిరి నుండి పోటీకి సిద్ధం అయిన విషయం తెలిసిందే. అభ్యర్థిత్వం ఖరారు కాగానే నియోజక వర్గంలో ప్రచారం ప్రారంభించాడు లోకేష్. అందులో భాగంగా నేడు నిడమర్రులో ప్రచారంలో ఉండగా ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవటం విశేషం.