telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ సెట్లో ప్రముఖ నటుడు మృతి

Godfrey

తైవాన్‌కు చెందిన నటుడు, మోడల్ గాడ్‌ఫ్రే గావో చైనాలో మృతి చెందారు. టీవీ షో షూటింగ్ జరుగుతుండగా హఠాత్తుగా కిందపడి మరణించారు. 35 ఏళ్ల గాడ్‌ఫ్రే గావో చైనాలో టీవీ రియాలిటీ షో ‘చెజ్ మీ’లో అతిథిగా పాల్గొన్నారు. ఊహించని విధంగా సెట్‌లో కింద పడిపోయారు. వెంటనే అక్కడున్నవారు గాడ్ ఫ్రే గావోను ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి గుండెపోటుతో మరణించారని నిర్థారించారు. అతని మృతదేహాన్ని తైవాన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఈ షో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ టీమ్ ఈవెంట్‌లో గాడ్ ఫ్రే కింద పడిపోయి, స్పృహ కోల్పోయాడని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అక్కడ అతను మృతి చెందాడని తెలిపారు. కాగా గాడ్ ఫ్రే పలు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి నటునిగా పేరు సంపాదించారు.

Related posts