telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పల్నాడులో టీడీపీ నేత దారుణహత్య

TDP-flag

ఏపీలో మరో టీడీపీ నాయకుడు హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ సీనియర్‌ లీడర్‌ పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దాచేపల్లి దగ్గర పంచాయతీ లోని సితారా రెస్టారెంట్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయం లో అంకులును నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి, మెడకోసి, హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంకులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కుడిభుజంగానూ, గ్రామంలో టీడీపీ పార్టీకి బలమైన నాయకుడిగానూ ఉన్నారు. 20 ఏళ్ల పాటు సర్పంచుగానూ, ఎంపీటీసీగా పనిచేశారు. గతంలో కూడా అంకులుపై పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగినప్పటికీ తప్పించుకున్నారు. పురంశెట్టి హత్య వెనుక గురజాల ఎమ్మెల్యే, దాచేపల్లి ఎస్సై హస్తం ఉన్నట్లు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక అసలు ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. 

Related posts