telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్కకు గౌతమ్ మీనన్ క్రేజీ ఆఫర్

Anushka

కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వెట్టాయియాడు విలయాడు’. ఈ సినిమాను తెలుగులో ‘రాఘవన్’ టైటిల్‌తో అనువాదం చేశారు. ఈ సినిమాకు ఇప్పుడు గౌతమ్ మీనన్ సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తాను ఈ సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తు్న్నట్టు గౌతమ్ వెల్లడించారు. త్వరలోనే ‘వెట్టాయియాడు విలయాడు’ స్క్రిప్ట్‌ను త్వరలోనే కమల్ హాసన్‌కు గౌతమ్ నెరేట్ చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోయిన్ కోసం గౌతమ్ మీనన్ అనుష్కను సంప్రదించారని సమాచారం. అనుష్క కూడా ఆసక్తి చూపిస్తున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనుష్క నటించిన “నిశ్శబ్దం” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts