telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

“కంటి వెలుగు”తో జగన్ సర్కార్ కు తలనొప్పి

వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభమయ్యింది. మొత్తం ఆరు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే కంటి వెలుగు పథకంపై ప్రతిపక్షాలు జగన్‌ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. కంటి వెలుగు పథకం గత టీడీపీ సర్కార్ హయాంలోనే అమలు చేశారని, ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ వైఎస్సార్‌ పేరు మార్చిందంటున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. గత ప్రభుత్వ హయాంలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు జరిగాయని.. కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేశామన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఇప్పుడు అదే పథకానికి వైఎస్ పేరు తగిలించి, కొత్త పథకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Related posts