telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సలార్’ అదిరిపోయే అప్‌డేట్ …

salar

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ప్రభాస్‌ ఎదిగిన విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఇటీవలే చేసిన మరో భారీ ప్రాజెక్ట్‌ “సలార్‌” మూవీ. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా… ఈ సాలిడ్‌ సినిమా మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్టుగా నిలిచింది. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. ఇది ఇలా ఉండగా.. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ అదిరిపోయే అప్డేట్‌ అందించింది. సలార్‌ మూవీ షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. రేపు అనగా 15న ఉదయం 11 గంటలకు సలార్‌ మూవీ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌తో పాటు తెలుగు, కన్నడ సిని పరిశ్రమలకు చెందిన పలవురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Related posts