telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బంద్ కు మద్దతు.. తెగిపడ్డ బొటనవేలు

apsrtc protest from mid night today

ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు మద్దతుగా శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్‌ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్‌ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్‌ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Related posts