telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 12న లీవ్‌ పెడితే.. 4 రోజులు సెలవులు

A[ro; 2019

ఈ నెల 11న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ప్రకటించింది. గురువారం పోలింగ్ శుక్రవారం పని దినం, తరువాత 2 రోజులు.. అంటే రెండో శనివారం, ఆదివారం సెలవులు. చాలా మంది ఉద్యోగులకు శుక్రవారం కార్యాలయాలకు సెలవు పెడితే నాలుగు రోజులు సెలవు దినాలు కలిసి వస్తాయి. ఎండలు పెరిగిపోవడంతో ఈ నాలుగు రోజుల సెలవుల్లో వేసవి ట్రిప్‌కు వెళ్తారనేది ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. ఆ రోజు శుక్రవారం. తదుపరి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవులు వచ్చాయి. దీంతో 3 రోజుల సెలవులను జాలీ డేస్‌గా వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హైదరాబాద్‌లో 50 శాతం కూడా నమోదు కాలేదు. ఉద్యోగుల్లో చాలా మంది టూర్లకు వెళ్లడమే పోలింగ్‌ తక్కువగా నమోదు కావటానికి కారణమని రాజకీయ పార్టీలు గుర్తించాయి. ఈసారి కూడా పోలింగ్‌పై ప్రభావం పడుతుందోమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Related posts