telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే

supreme court cj

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే స్పందించారు. రాజస్థాన్ లోని జోద్ పూర్ లో హైకోర్టు భవనం ప్రారంభోత్సవంలో బాబ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమనేది ప్రతీకారంగా మారితే అది తన లక్షణం కోల్పోతుందని పేర్కొన్నారు. సత్వర న్యాయం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

రేప్ కేసుల్లో సత్వర తీర్పులు చెప్పాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో సీజేఐ విభేదించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత కూడా ఉందని పేర్కొన్నారు. నిందితుడు నేరం చేశాడన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నారు. చట్టాల ప్రకారం నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయని ఆయన పేర్కొన్నారు.

Related posts