తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కేందుకు రెడీ అయ్యారు. పైలట్ రోహిత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో రోహిత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
టీఆర్‌ఎస్‌లో చేరతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ మారే అవకాశమున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో బిజీగా ఉంది.
మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం…