telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జరిమానా కట్టిన శశికళ.. తమిళనాడులో రాజకీయాల్లో కొత్త చర్చ

బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళ న్యాయస్థానం విధించిన రూ. 10 కోట్ల జరిమానా చెల్లించారు. నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని.. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారంలో ఉండాలని అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ మైఖేల్‌ కున్హా తీర్పు ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 27కు ఆమె శిక్షాకాలం పూర్తి కానుంది. న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా యాక్సిస్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు బ్యాంకులకు చెందిన 2 డిమాండు డ్రాఫ్ట్‌లను (తలా రూ. 5కోట్లు ) బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు కార్యాలయంలో అందజేశామని శశికళ తరఫు న్యాయవాది రాజా సెంతూర్‌ పాండ్యన్‌ తెలిపారు. అయితే.. శశికళ జనవరి చివరిలో.. ఫిబ్రవరి మొదటివారంలో ఆమె విడుదలకానున్నారు. ఆరు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో విడుదల అవుతున్న శశికళ ఏ దిశగా అడుగులేస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది.

Related posts