గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్‌లో రఘనందన్ రావు మాట్లాడారు. వందకు వంద శాతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ప్రభావం ఉంటుందని పేర్కొన్నాడు. ఉప ఎన్నిక సమయంలో తమపై పెట్టిన కేసులను న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడితే ఆలస్యమైనప్పటికీ విజయం దక్కుతుందని…దీనికి ఉదాహారణ తానేనని తెలిపాడు. తన కోసం పోరాడిన కార్యకర్తలను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో 30 నుంచి 40 మంది నాయకులు అసంతృప్తులుగా ఉన్నారని.. వారందరూ బీజేపీలోకి రావాలని సూచించారు. హైదరాబాద్‌పై బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పదవులు ఉన్నా లేకున్నా..తాను జీవితాంతం బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. దుబ్బాకను అద్భుతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిద్ధిపేటతో సమానంగా మామ, అల్లుడు మెడలు వంచి దుబ్బాకు నిధులు తీసుకువస్తామని రఘనందన్ రావు తెలిపారు.