మేషం : కొన్ని వ్యక్తిగత సమస్యలతో పాటు ఇంట్లోని ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు మీ ఆదాయ వనరులను బలోపేతం చేయడంలో నిమగ్నమైన ఉన్నారు. ఇప్పుడు ఈ విషయానికి విరామం ఇవ్వండి. ఇంట్లోని యువకులకు అవసరమైన వివాహం లేదా ఉద్యోగ విషయాలను పరిశీలించడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు అనవసర ఖర్చుకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 59 శాతం మద్దతు ఇస్తుంది.
వృషభం : మీ ఆందోళనలకు కొన్ని బహుముఖ కొలతలు ఉన్నాయి. ఓ వైపు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. భూమి, ఆస్తి, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. పిల్లలు లేదా తోబుట్టువుల విషయంలో కొంత ఆలోచించే అవకాశముంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు వాటిని అధిగమించే అవకాశముంది. ఈ రోజు మీకు అదృష్టం 50 శాతం కలిసి వస్తుంది.
మిథునం : ప్రస్తుతం మీరు తగ్గిపోయిన నిధుల గురించి ఆందోళన చెందుతున్నారు. మీరు తగిన సమయాన్ని గడపడంలో మీ బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. మీరే దాత అని నిరూపించడానికి తగిన రుణాలు ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు మీకు అదృష్టం 51 శాతం మద్దతు ఇస్తుంది.
కర్కాటకం : ఈ రోజు మీరు మీ వ్యాపారం లేదా పని గురించి ఆందోళన చెందుతారు ఈ సమయంలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. వ్యాపారంలో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉంటే అదృష్టం మీకు ఎంతో కలిసి వస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం కలిసి వస్తుంది.
సింహం : ఈ రోజు ఏదైనా చట్టపరమైన వివాదం లేదా ఇతర రకాల కోర్టు వ్యవహారం కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. అయితే ఈ ఇబ్బందులను త్వరలోనే తొలగిపోతాయని గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మధ్యాహ్నం తర్వాతా మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజు మీకు అదృష్టం 69 శాతం మద్దతు ఇస్తుంది.
కన్య : ఏదైనా విషయంలో ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ముందుకు నడిపించాలని భావిస్తారు. అది మంచి విషయం. అయితే మీరు వీలైనంత వరకు అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. లేకపోతే మీకు హాని జరగవచ్చు. ఈ రోజు మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెడితే మంచిది. ఈ రోజు మీరు ఇతరుల ఇబ్బందుల విషయాల్లో నిమగ్నమై ఉంటే మీ ముఖ్యమైన పని అసంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్టం 55 శాతం కలిసి వస్తుంది.
తుల : ఈ రోజు మీ వ్యయభారం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత ఖర్చులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో ముఖ్యమైన సమస్య గురించి ఇంట్లో చర్చ జరగవచ్చు. కొంతవరకు కుటుంబం, బంధువుల విషయాల గురించి ఆందోళన చెందుతారు. సామాజిక ప్రతిష్టను పెంపొందించడానికి ఆలోచనాత్మకంగా ఖర్చు చేయండి. దేని గురించి అతిగా ఆలోచించకుండా మీ పనిపై దృష్టి పెడితే మంచి జరుగుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 55 శాతం మద్దతు ఇస్తుంది.
వృశ్చికం : కొన్నిసార్లు మీరు ఎక్కువగా మాట్లాడితే ప్రజలు మీ వెనక నుంచి విమర్శించే అవకాశముంటుంది. మీరు తక్కువగా మాట్లాడటం, మీ పనితీరు సరిగ్గా ఉంచుకోవడం వల్ల తర్వలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉపాధిరంగంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రతి పనిలోనూ మీరు సహచరుల నుంచి గౌరవం, సహకారం పొందే అవకాశముంది. ఈ రోజు మీకు అదృష్టం 86 శాతం కలిసి వస్తుంది.
ధనస్సు : మీరు ఎల్లప్పుడూ మధ్యస్తంగా ఉండటం వల్ల విజయవంతమవుతారు. ఈ రోజు కూడా మీకు కొన్ని ముఖ్యపనుల్లో మధ్యవర్తిత్వం ఇవ్వడం వల్ల పనిలో విజయాన్ని సాధిస్తారు. మీ ఖర్చులకు సొంతంగా సంపాదించిన సొమ్మును వాడండి. ఈ సమయంలో మార్పు సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పనిలో ఆలోచనతో ముందడుగు వేయండి. ఈ రోజు మీకు అదృష్టం 79 శాతం మద్దతు ఇస్తుంది.
మకరం : ఈ రోజు కార్యాలయంలో మీకు అన్ని ప్రశ్లనకు సమాధానమివ్వండి. అంతేకాకుండా మరోవైపు మీ బాధ్యతలు పెరుగుతున్నాయి. నూతన ప్రయోజనాలు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పనిలోనైనా నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. లేకపోతే నష్టం వాటిల్లుతుంది. ఈ రోజు ఏ రకమైన ఏజెన్సీ లేదా పంపిణీ కేంద్రానికి సమ్మతి ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం కలిసి వస్తుంది.
కుంభం : కుంభ రాశి వారు ఈ రోజు ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసిన తర్వాతే నిద్రపోతారు. ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఈ రోజు కూడా మీరు అలాంటి పనుల్లో భాగమవుతారు. వైవాహిక జీవితంలో చాలా రోజు ప్రతిష్ఠంభన ముగుస్తుంది. ఈ రోజు సోదరి, బావతో లావాదేవీలు నిర్వహించవద్దు. లేకుంటే మీ సంబంధం క్షీణిస్తుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి కనబరుస్తారు. దాతృత్వ పనులకు ఖర్చు చేయవచ్చు. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం మద్దతు ఇస్తుంది.
మీనం : చాలాకాలం తర్వాత మీకు ఆనందం, ఉపశమనం కలుగుతాయి. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడు మెరుగుపడుతుంది. దీంతో ఈ రోజు మీరు ఊపిరి పీల్చుకుంటారు. పని పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక, సాంస్కృతి కార్యకమాల్లో పాల్గొనే అవకాశముంది. ఆగిపోయిన పనిని ప్రారంభించేందుకు తిరిగి అవకాశం లభిస్తుంది. ఈ రోజు చాలా షాపింగ్ చేస్తారు. ఈ రోజు మీకు అదృష్టం 95 శాతం కలిసి వస్తుంది.