telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్ సినిమాకు రేటు పెంచిన స్టార్ హీరోయిన్…

Poojahegde

తమిళ్ స్టార్ హీరో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి సినిమా అంటే అభిమానులకు కన్నుల పండుగనే చెప్పాలి. అయితే అతడి సినిమాలో నటించేందుకు హీరోయిన్లు సైతం పోటీపడుతుంటారు. అతడితో  ఒక్క సినిమా చేసినా చాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్దె కు దక్కింది. అయితే ఈ సినిమాకు పూజా హెగ్డే రేటు పెంచేసినట్లు కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అమ్మడి కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ పారితోషికాన్ని ఈ సినిమాకి అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం పూజకి దాదాపు రూ.3.5 కోట్ల పారితోషికం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే పూజా హిగ్దె మొదట తెలుగులో అవకాశాలు అంతగా లేకపోవడంతో 2012లో ముగమూడి అనే సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా పూజాకు నిరాశ మిగిల్చింది. దాంతో మళ్లీ తెలుగులోనే అవకాశాలు అందుకొని ప్రస్తుతం అగ్రహీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే విజయ్ 65వ సినిమాగా రాన్నున్న ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కించనున్నారు.

Related posts