అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నారు . ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, నాగ చైతన్య, అనసూయ, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, హీరోయిన్ దక్ష నగర్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హాజరయ్యారు. నాగార్జున, నాగ చైతన్య పంచ కట్టులో సంక్రాంతి అల్లుళ్ళ తయారై వచ్చారు.. వీరు ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.