telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నుండి అలియా ఫస్ట్ లుక్ అప్పుడే..?

rrr

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కనిపించనుంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఈ సినిమా 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే మార్చి15న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 15న అలియా పుట్టినరోజు సందర్భంగా సీతారామరాజు జోడీ అయిన సీత పాత్రను పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది. కానీ దీని పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధిస్తుంది అనేది.

Related posts