telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లు: సీఎం జగన్‌

మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లు గా ఉంటారని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయన జమ్మలమడుగులో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు.

200 బోర్‌వెల్స్‌ కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామని జగన్‌ అన్నారు.నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్‌తో పాటు రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే ఈ ప్రాంతం మారుపోతుందని అన్నారు.

Related posts