బంగారంకు ఉన్న డిమాండ్ మారేదానికి లేదు. బంగారం ఎంత ధర ఉన్న కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కరోనా వల్ల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే బులియన్ మార్కెట్‌లో గత రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 48,160 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44,150 పలుకుతోంది. బంగారం ధర పెరిగగా.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ.73,700 వద్ద కొనసాగుతోంది.