telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక ఎన్టీఆర్..

మ‌హా నాయ‌కుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ 26వ వ‌ర్ధంతి నేడు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల అభిమానులు, కుటుంబ‌స‌భ్య‌లు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళుల్పించారు. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ 26 వ వర్ధంతి ని పురష్కరించుకోనిఅమరావతిలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ ఘనంగా నిర్వహించింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావ్‌, నారా లోకేష్‌, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులు హాజరయ్యారు.

అనంత‌రం.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు మహా నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు కొనియాడాడు.. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో ప్రజల కోసం నిరంతరం పని చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని చంద్ర‌బాబు అన్నారు.

బడుగు , బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారాక రామారావు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కథానాయకునిగా.. మహా నాయకునిగా వెలిగిన ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. లక్షల మంది కార్యకర్తలు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో నడుస్తున్నార‌నీ,  ఇప్పటి వరకూ సినిపరిశ్రమలో ఎన్టీఆర్‌లా ఎవరూ నటించలేరని  చంద్రబాబు కొనియాడారు.

Related posts