telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎన్నో త్యాగాలు చేసిన మ‌హా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్‌

*వైసీపీ పార్టీ రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ‌లు
*ఇదిఆత్మీయ సునామీ..
*వైసీపీ జీవితకాలం అధ్య‌క్షుడుగా జ‌గ‌న్‌
*ఎన్నో త్యాగాలు చేసిన మ‌హా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్‌

*విజ‌య‌వాడ‌- గుంటూరు మ‌ధ్య మ‌హాస‌ముద్రం క‌నిపిస్తొంది.

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేర‌కు గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ ప్లీన‌రీలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారు.

ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభతో జగన్ మాట్లాడుతూ ..పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

విజయవాడ-గుంటూరు మధ్య ఇవాల మహా సముద్రం కనిపిస్తోంది. వర్షం పడుతున్న ఎవరూ చెదరలేదు. ఈ ప్లీనరీ ఆత్మీయులు సునామీ. 13 ఏళ్లుగా ఇదే అభిమానం.. ఇదే నమ్మకం నాపై చూపిస్తున్నారు.

ద‌శాబ్ధం పాటు క‌ష్టాల‌ను భ‌రించి, అవ‌మానాలు త‌ట్టుకొని త్యాగాలు చేసిన నా సైన్యం ఇక్క‌డ ఉంది. ఈ మహా సైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తున్నాను’’ అని చెప్పారు.

ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి నాపై కేసులు పెట్టారు. ఆనాడు లొంగిపోయి ఉంటే జగన్ ఇవాళ మీ ముందు ఉండేవాడు కాదు. నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది.

ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం 22కి చేరింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు.

వైసీపీ ఉండకూడదని, జగన్ కనబడకూడదని కుట్రలు, కుయుక్తులు పన్నారు. కానీ దేవుడు స్క్రిప్ట్ మరోలా రాశారు.  2014లో 23 ఎమ్మెల్యేలను కొన్న పార్టీకి.. 2019లో అన్నే సీట్లు వచ్చాయి అని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు.

మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడమే. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి చేరింది’ అని సీఎం జగన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Related posts