telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వచ్చే నెల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేస్తాం: సీఎం జగన్

jagan

ఏపీ సీఎం జగన్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు వ్యవసాయ మిషన్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేస్తామని తెలిపారు. దీనివల్ల కరవు కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తృణధాన్యాల సాగు పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అదే సమయంలో ప్రాసెసింగ్ యూనిట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని చెప్పారు తృణధాన్యాలకు గిట్టుబాటు ధరవచ్చేలా అధికారులు చూడాలని ఆదేశించారు.

ఏపీలో టమోటా పంట ధర పడిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పశువుల కోసం వినియోగిస్తున్న మందుల్లో నాణ్యత ఉండటం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండే మందులనే వాడాలని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో పరిస్థితులపై శ్వేతపత్రం తయారుచేయాలని అధికారులకు సూచించారు.

Related posts