telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ కరోనా అప్డేట్.. 24 గంటల్లో ఎన్నంటే

Covid-19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు భారీగా పెరిగాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.49 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,728 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 97 వేల 705 కి చేరింది. ఇందులో 20, 857 కేసులు యాక్టివ్ గా ఉంటే… 8,22,011 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 09 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6, 837 కి చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపూర్ లో 99, చిత్తూరులో 206, తూర్పుగోదావరి జిల్లాలో 290, గుంటూరులో 212, కడపలో 85, కృష్ణాలో 223, కర్నూలులో 36, నెల్లూరులో 91, ప్రకాశంలో 88, శ్రీకాకుళంలో 43, విశాఖపట్నంలో 74, విజయనగరంలో 42, పశ్చిమ గోదావరిలో 239 కేసులు నమోదయ్యాయి.

Related posts