పాక్ పాప్ సింగర్ రబీ పిర్జాదా .. గతంలో జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నిరసనగా విష కీటకాలను బహుమతిగా పంపిస్తానని ప్రధాని మోడీని బెదిరించిన విషయం తెలిసిందే. ఆమె తాజాగా ఆయనపై ఆత్మహుతి దాడి చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ జాకెట్ ధరించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ…మోడీని హిట్లర్‌గా అభివర్ణించారు. ఆర్టికల్ రద్దుపై నిరసనగా బెదిరింపులకు దిగారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలను బాధ్యత రహితంగా వినియోగించారంటూ, పాకిస్తాన్ వైఖరిని ప్రపంచానికి తెలియజేశారంటూ మండిపడ్డారు. గత నెలలో కూడా పాములు, మొసళ్లతో కూడిన 15 సెకన్ల వీడియోలో మోడీపై వాటిని వదులుతానని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. దీంతో వన్య ప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు పంజాబ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ అండ్ పార్క్స్ విభాగం ఆమెపై చర్యలు ప్రారంభించింది. లాహోర్ కోర్టు రబీ ఫిర్జాదాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇకపై అది అధికారికంగా నీ సమస్య… అల్లుడిపై నాగబాబు షాకింగ్ కామెంట్