telugu navyamedia
రాజకీయ

తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇంట్లో ఉన్న‌వాళ్ల‌కి..
*ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయండి.
*తలుపులు మరియు కిటికీలు మూసివేసి ఉంచండి.
*మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ప్ర‌దేశానికి చేరుకోండి.
*రేడియో న్యూస్ వినండి,అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి.
*వేడిచేసిన, క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.

బయట ఉన్న‌వాళ్ల‌కి
*దెబ్బతిన్నపాత భవనాల్లోకి ప్రవేశించవద్దు.
*వీలైనంత త్వరగా సురక్షితమైన షెల్టర్ కు చేరుకిండి.
*చెట్టు, విద్యుత్ స్తంభం కింద ఎప్పుడూ నిలబడకండి.
*వాతావరణం ప్రశాంతం గా ఉంటే జాగ్రత్త గా నిశితంగా వేచి చుడండి, తుఫాను ముగిసిందని అనుకోకండి, ఒక్కసారిగా పెద్దహింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవవచ్చు, అధికారిక ఉత్తర్వులు ‘ఆల్ క్లియర్’ అని వచ్చెంతవరకు సుర‌క్షితంగా , సహ‌నంతో ఉండండి.

తుఫాను తరువాత..
*వేడిచేసిన, క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
*అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్ లో ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు.
*విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు మరియు ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.
*దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.
*దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయంచండి.

మత్స్యకారులు చేయవలసినవి..
*పుకార్లను నమ్మకండి, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
*మొబైల్ ఫోన్లను అత్యవసర సమయం లో వాడుటకు, కమ్యూనికేషన్ కు ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచండి, SMS లను చూస్తూ ఉండండి.
*ముఖ్యమైన ఫోన్ నంబర్స్ ను కాగితంపై వ్రాసి సురక్షితంగా ఉంచండి.
*అదనపు బ్యాటరీలతో రేడియో ను మీతో ఉంచుకోండి.
*వాతావరణ సమాచారం/హెచ్చరికల కోసం,రేడియో న్యూస్ వినండి, టీవీ చూడండి, వార్తాపత్రికలు చదవండి.
* పడవలు, తెప్పలను సురక్షితమైన ప్రాంతం లో కట్టి ఉంచండి.
*సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు.
చూస్తూ ఉండండి.

 

Related posts