telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ పై హనుమంతరావు కామెంట్స్…

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తనకు రేవంత్‌రెడ్డి అనుచరుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై కామెంట్లు చేశారు.. సూర్యాపేట జిల్లా చింతలపాలేం మండలం దొండపాడు గ్రామంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 90వ దశకంలోనే తనకు సీఎం అయ్యే ఛాన్స్ వస్తే.. సొంత కులస్తులే తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నిన్న గాక మొన్న వచ్చిన వ్యక్తికి పీసీసీ అధ్యక్షుడిని ఎలా ఇస్తారని రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేసిన వీహెచ్.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా.. నన్ను ఎవరూ బెదిరించలేదు.. కానీ, నిన్నమొన్న వచ్చిన ఓ కొత్త నాయకుడు అభిమానుల పేరుతో బెదిరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, అలాంటి బెదిరింపులకు తాను ఎప్పుడు భయపడింది లేదు.. భయపడేది లేదన్నారు వి. హనుమంతరావు.. మరోవైపు.. వంగవీటి మోహనరంగ ఎదుగుదలను చూడలేకే ఆయన్ని హత్య చేశారని అన్నారు.

Related posts