telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

యాంకర్ ప్రదీప్ సినిమా విడుదల తేదీ వచ్చేసింది…

అనేక టీవీ ఛానల్లో యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే అనేక మంది యాంకర్లు సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ వరసలో ఇప్పుడు ప్రదీప్ కూడా చేరిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా అనే పుస్తకాలు ఎన్నో వచ్చాయి. ఇదే క్రమంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా రాబోతున్నది. ఈ సినిమాలోని “నీలీ నీలి ఆకాశం” పాట విడుదలకి ముందే అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాగా, ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తిచేసుకున్నప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో అప్పటి నుంచి ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో మున్నా అనే డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఈ సినిమా అమధ్యే OTT లో విడుదల చేయాలని నిర్ణయించుకున్న.. థియేటర్స్  ఓపెన్స్ అయ్యేసరికి నిర్ణయం మార్చేసుకున్నారు. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. జనవరి 29 న థియేటర్స్ లోకి రాబోతుందంటూ పోస్టర్ విడుదల చేశారు. ప్రదీప్ పక్కన అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా విజయవంతం అవుతుందా… లేదా అనేది.

Related posts