telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

30 మందికి పునర్జన్మనిచ్చిన శునకరాజం… కానీ…

Dog

విశ్వాసానికి మారుపేరు శునకం అనే విషయం అందరికీ తెలిసిందే. తన యజమాని ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డేస్తుంది కుక్క… అయితే తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ శునకం చేసిన పనికి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని బాందా సిటీలోని శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫర్నీచర్ షో రూంలో చెలరేగిన మంటలు పై అంతస్థులకు వ్యాపించాయి. పైనున్న మూడు, నాలుగు అంతస్థులలో కొంతమంది నివసిస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా… కిందనున్న మంటలు వేగంగా పైకి వ్యాపిస్తున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన వారి పెంపుడు కుక్క… పెద్దగా అరుస్తూ అందరినీ అలర్ట్ చేసింది. దాని అరుపులతో ఒక్కసారిగా మేల్కొన్న వాళ్లు అక్కడి నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డారు. 30 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అంతమందిని ప్రాణాలతో బయటపడేసిన ఆ శునక రాజం మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కింద ఫ్లోర్‌లో కట్టేసి ఉండటంతో సజీవంగా మంటలకు ఆహుతైపోయింది. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లు తమకు పునర్జన్మ నిచ్చిన ఆ మూగజీవి పట్ల కృతజ్ఞతాభావంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అక్రమంగా ఫర్నీచర్ షోరూమ్ నిర్వహిస్తున్నయజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Related posts