telugu navyamedia
రాజకీయ

పోలీస్ స్టేషన్‌లో చీపురు పట్టి ఊడ్చిన‌ ప్రియాంక..

కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీని అరెస్ట్ చేసి ఉంచిన సీతాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక చీపురు ప‌ట్టారు, తను ఉన్న గదిని తానే ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు. రాత్రి లఖీంపూర్‌ఖేరీ సందర్శించటానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని సీతాపూర్‌ స్టేషన్‌ కు తరలించారు.

Detained on her way to Lakhimpur Kheri, Priyanka Gandhi offers 'shramdaan' | Latest News India - Hindustan Times

ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్‌ ఓ జరిగిన ఘటన బాధితులను ఓదార్చటానికి మాత్రమే వెళ్తున్నానని.. ఇందులో ఏం నేరం ఉందని ప్రియాంక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఆర్డర్ చూపించి కారు ఆపాలంటూ ప్రియాంక కోరారు. ఈ దేశం రైతులదని, బీజేపీది కాదంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు.

detained priyanka gandhi vadra cleans the pac guest house in sitapur district | ലഖിംപുർ സംഘർഷം: കസ്റ്റഡിയിലെടുത്ത പ്രിയങ്ക ഗാന്ധി നിരാഹാര പ്രതിഷേധത്തിൽ; സീതാപൂരിലെ പൊലീസ് ...

అంత‌కుముందు.. లఖింపూర్ ఖేరీను సందర్శించాలని ప్రియాంక లక్నోలోని తన ఇంటినుంచి లఖింపూర్ ఖేరీకి తెల్లవారుజామున బయలు దేరారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడుగడుగా అడ్డుకున్నారు. ఉద్రిక్తల కారణంగా అక్కడికి వెళ్లే అనుమతి లేదని పోలీసులు తెలపటంతో, గృహ నిర్బంధంలో నుంచి ఆమె కాలినడకన ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో హరగావ్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని పోలీసులు అరెస్టు చేసి సీతాపూర్‌ స్టేషన్‌కు తరలించారు.

Related posts