telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సర్ఫింగ్ చేస్తున్న ఏడేళ్ల బాలుడిని ఎత్తిపడేసిన షార్క్… వీడియో వైరల్

boy

సర్ఫింగ్ చేస్తున్న ఏడేళ్ల ఫ్లోరిడా బాలుడ్ని షార్క్(సొరచేప) ఎత్తి పడేసిన వీడియో ఒకటి ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్‌లో థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ సందర్భంగా చండ్లర్ మూర్(7) అనే బాలుడు తన తండ్రితో కలిసి సర్ఫింగ్‌కు వెళ్లాడు. చండ్లర్ సర్ఫింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా షార్క్ అతడ్ని కింద పడేసి వెళ్లిపోయింది. అయితే గోఫ్రో కెమెరాలో చూసేంత వరకు తనను కింద పడేసింది సొరచేప అని చండ్లర్‌కు తెలియలేదు. సర్ఫ్ బోర్డుకు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైయ్యాయి. అది చూసిన తండ్రి, కొడుకు షాకయ్యారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగేళ్ల వయసు నుంచి తన కుమారుడు సర్ఫింగ్ చేస్తున్నాడని, ఇలా షార్క్ దాడి చేయడం ఇదే తొలిసారి అని చండ్లర్ తండ్రి తెలిపాడు. కాగా, న్యూ స్మిర్నా బీచ్ షార్క్‌లకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా షార్క్ దాడులు నమోదైంది ఈ బీచ్‌లోనే. షార్క్స్ అనేక సందర్భాల్లో పర్యాటకులు, సర్ఫర్‌లపై దాడి చేశాయి. కనుక ఈ బీచ్‌కు వచ్చేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Video Source: Inside Edition

Related posts