telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీ వరాల జల్లు.. రైతు భరోసా నుండి.. నియామకాల వరకు..

voilance jummalamadugu ycp tdp

లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తటస్థులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాలు గురించి వారికి వివరించారు. తమ పథకాలను టీడీపీ ఎంత కాపీ కొట్టినా, ప్రజలు ఆ పార్టీని విశ్వసించే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవి..

* మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి రూ.2000 ఇస్తామని, పవర్‌లూం ఉన్న వారికి విద్యుత్‌ చార్జీలను తగ్గించనున్నట్లు తెలిపారు.

* ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి కులానికి ఓ కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.

* వైఎస్‌ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలకు త్వరిగతిన పూర్తిచేస్తామన్నారు.

* వై.ఎస్.ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాలు దాటిని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ హామి ఇచ్చారు. నాలుగు సంవత్సరాలలో 75వేలు ఉచితంగా ఇస్తామన్నారు.

* గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని, ప్రతి గ్రామంలో 10 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

* ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలవరీ చేసేందుకు ప్రతి కుటుంబాలకు రూ.5000 జీతంలో ఒకరిని నియమిస్తామని, దరఖాస్తు చేసుకున్న 72గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరి చేయనున్నట్లు తెలిపారు.

* కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్న సరే గానీ, అందులో ఐదు శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరణమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన, ఏర్పాటు కానున్న పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామన్నారు.

* కేలండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు.

* వైఎస్సాఆర్‌ రైతు భరోసా ద్వారా 85లక్షల మందికి పైగా రైతులకు ప్రతి నెల నెలలో రూ.12500 ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామి ఇచ్చారు. వైఎస్‌ తన పదవీ కాలంలో పథకాల తీరుపై స్వయంగా అధికారులకు ఫోన్‌ చేసేవారని, సిఎం సీటులో ఉన్న వ్యక్తి ధ్యాసను బట్టి పథకాలు అమలు ఆధారపడి ఉంటుందన్న విషయాలను గమనించాలన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాళ్లనే ఈ లోకం గుర్తుపెట్టుకుందని, ఆలా చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

Related posts