telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఫాంహౌస్ బాగుంటే సరిపోదు.. పేద ప్రజలను పట్టించుకోండి

BJP Bandi sanjay

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముప్పు ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బిజెపి నాయకులు సందర్శించారు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం లోని పలు డివిజన్ లను హయత్ నగర్ బజారు కాలనీ, బైరమల్ గూడా చెరువు సమీపంలో ఉన్నటువంటి అర్జున బస్తి ని సందర్శించిన బండి సంజయ్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా కేటీఆర్ గారు సందర్శించిన సందర్భంలో అడ్డుకున్న వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయాల్సిందిగా స్థానిక నాయకులకు ఆజ్ఞాపించారు.

అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని.. కేసీఆర్ గారికి తన ఫాంహౌస్ బాగుంటే సరిపోదు పేద ప్రజలను కూడా పట్టించుకోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఇల్లు లేనివారికి ఇల్లు కల్పించాలని లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలి వస్తుందని..బండి సంజయ్ తెలిపారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం యాచారం మండలం లో ఫార్మాసిటీ నెలకొల్పడంలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు అడ్డుకోవడానికి వెళ్లిన రైతులను బీజేపీ కార్యకర్తలను రాత్రికి రాత్రి పోలీసులు స్టేషన్ కు తరలించి వారిపై దుర్మార్గంగా లాఠీఛార్జి చేసి నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. యాచారం మండలం లో ఫార్మా సిటీని ఎలా పెడతారో చూస్తామంటూ సవాల్ విసిరారు. బిజెపి నాయకులు కార్యకర్తలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని బండి సంజయ్ సూచించారు.

Related posts