telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పై ప్రధానిని కలుస్తా : పవన్

Pawan

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధానిని కలుస్తామని అన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. దీనిపై రాజకీయ..కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. స్ట్రాటజిక్ సేల్ నిర్ణయం తిప్పికొట్టేందుకు ఆందోళనలకు దిగుతున్నాయి. మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ ఉదయం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ప్రాణాలు ఇచ్చయినా స్టీల్ ప్లాంట్‌ను  కాపాడుకుంటామని లోకల్ నేతలు చెబుతున్నారు.  విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహారదీక్షలు, రాజీనామాలకు వెనుకాడబోమని ప్రకటించారు ఎంపీలు. స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. చూడాలి మరి పవన్ ఎప్పుడు మోడీని కలుస్తారు అనేది.

Related posts