telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా తగ్గడానికి చాలా దూరంగా ఉన్నాం…

yogi adityanath

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా వ్యాప్తి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ‘కరోనా తగ్గడానికి చాలా దూరంగా ఉన్నాం, దాని తాకిడిని తగ్గించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తయారుచేయడానికి మన శాస్త్రవేత్తు ఎంతో కష్టపడుతున్నారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎంతో మెరుగ్గా ఈ మహమ్మారితో పోరాడుతుంది. వ్యాక్సిన్ పూర్తియితే అందరికి అందించబడుతుంది. అప్పటి వరకూ జాగ్రత్తాగా ఉండాల’ని యోగి అన్నారు. అయితే కరోనాతో చేసే పోరాటంలో మనం ఎంతగానో మెరుగుపడ్డామని మొదట రాష్ట్రంలో ఒక్కరోజుకు కేవలం 72 పరీక్షలు మాత్రమే జరిగాయని, ఇప్పుడు ఆదివారం ఒక్క రోజున 1.45 లక్షల పరీక్షలు చేయగలుగుతున్నామని తెలిపారు. ‘ఇప్పటికి ఎనిమిది నెలలుగా నిరంతరాయంగా ఈ మహమ్మారితో మనం యుద్దం చేస్తున్నాం. అయితే మన రాష్ట్ర డాక్టర్లను చూస్తే నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో కూడా రాష్ట్రంలో కరోనా పెరగకుండా అడ్డుకుంటున్నారు. మనం ఇంకా సంతోషంగా ఉన్నామంటే అది వారు వారి సంతోషాన్ని పణంగా పెట్టి అరువు తెచ్చినదనే చెప్పాల’ని యోగి తెలిపారు. అయితే వ్యాక్సిన్‌ కోసం దేశంలోని శాస్త్రవేత్తలు పగలురాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నారు. మనం కూడా నిబందనలను పాటిస్తే దేశానికి సహాయం చేసిన వారిమవుతామని పేర్కొన్నారు.

Related posts