భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టేశాడు. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలో తన ముద్ర బలంగా వేయాలనే ఉద్దేశంతో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన తొలి బంతినే బౌండరీకి పంపిన కిషన్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ (56) అందుకున్నాడు. అయితే ఫస్ట్ మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించిందని కిషన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. మరొక చివరలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సీనియర్ ఆటగాడు (విరాట్ కోహ్లీ) ఉన్నాడని తెలుసు. అయినా నేను మ్యాచ్ పూర్తి చేయాలనుకున్నా.. అలా జరగలేదు. ఇంతదూరం రావడానికి నాకు సహాయం చేసిన నా కోచ్‌లు, సీనియర్లు మరియు ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఇన్నింగ్స్, అవార్డు నాన్నకు అంకితం ఇస్తున్నా’ అని మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కిషన్.. 145.76 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 516 పరుగులు చేశాడు. ఇందులో 36 ఫోర్లు, 30 సిక్సర్లు ఉండటం గమనార్హం.
previous post
next post