ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ, టీడీపీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోమారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా ? లేక విపక్ష నేత వైఎస్ జగన్ సీఎం అవుతారా? అన్నది మే 23 తర్వాత తెలుస్తుంది.
అయినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయం సాధించేది తామేనని ఘంటాపథంగా చెబుతున్నారు. సీఎంగా జగన్ రానున్నారని అంటూ, ఆయన పేరిట నేమ్ ప్లేట్ ను తయారు చేయించి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు” అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కనిపిస్తున్న నేమ్ ప్లేట్ ఇప్పుడు తెగ షేర్ అవుతోంది.