telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? ట్రైలర్ విడుదల…

ఇదివరకు వెండితెరపై చిన్న చిన్న పాత్రలు పోషించిన యాంకర్ ప్రదీప్ తన కెరీర్‌లో మొదటిసారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలోని “నీలీ నీలి ఆకాశం” పాట విడుదలకి ముందే అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాగా, ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తిచేసుకున్నప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో అప్పటి నుంచి ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో మున్నా అనే డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్యర్ న‌టించారు. దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అనూప్‌ సంగీతం అందిస్తుండగా, ‘నీలి నీలి ఆకాశం’.. సాంగ్‌ ఎంత హిట్ అయిందో తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమైనా ‘30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ సినిమా.. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చినా నిర్మాతలు థియేటర్ల వైపే మొగ్గు చూపారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసాడు హీరో విజయ్ దేవరకొండ. అయితే ఈ ట్రైలర్ చుసిన తర్వాత సినిమా పై అంచనాలు ఇంకా పెరిగాయి.

Related posts