telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు గుత్తా కృతఙ్ఞతలు

TRS Leader Gutha Critics Uttam

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి ధ్రువీకరణపత్రాన్ని గుత్తా అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీగా ఏకీగ్రీవం అయ్యేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, మంత్రులు, పార్టీ నేతలకు కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. గతంలో ఎంపీగా ప్రజలకు ఏవిధంగా సేవలందించానో ఎమ్మెల్సీగానూ వారికి సేవలందిస్తానని గుత్తా పేర్కొన్నారు.

Related posts