telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా పేషెంట్లకు శుభవార్త..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.అయితే.. కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివిర్ మందు రేట్ ను 50 శాతానికి తగ్గించింది కేంద్రం. కరోనా వైరస్ వైద్యంలో రెమ్‌డెసివిర్ ను ప్రధాన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్ ధర రూ. 2450 గా ఉండగా.. తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ 1225 కే లభించనుంది. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ధర తగ్గింపు గురించి సమాచారం ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ప్రాణాలను రక్షించే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ధరలను కేంద్ర ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇది.. కరోనా రోగులకు నిజంగా గుడ్ న్యూస్ అని పేర్కొన్నారు.

Related posts