టాలీవుడ్ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది కూడా. అయితే మళ్ళీ నిన్న తాను డిశ్చార్జ్ అవుతున్నట్టు కూడా పేర్కొంది. నిన్న ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని ప్రకారం నేను నా టీం సెట్స్ లో అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ దురదృష్టవశాత్తు కరోనా సోకిందని, వారం క్రితం దగ్గు తగ్గకపోవడంతో వెంటనే హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని పేర్కొంది.
ఈ పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని ఆమె పోస్ట్ చేసింది. అయితే ఇంకా తగ్గలేదు కానీ ఇప్పుడు ఆరోగ్యం కాస్త మరుగు పడడంతో ఇంటి వద్దనే ఉండి రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని పేర్కొంది. ఇక 14రోజుల వరకు తమన్నా క్వారంటైన్ లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని నాకు నమ్మకం ఉందన్న ఆమె నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆమె తల్లిదండ్రులు కూడా కరోన బారిన పడి ఈ మధ్యనే కోలుకున్నారు. ఆమె కోలుకున్న కొన్ని రోజులకే తమన్నా వైరస్ భారిన పడటం హాట్ టాపిక్ గా మారింది.