telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెకండ్ వేవ్ ప్రమాదంగా మారింది : ఈటల హెచ్చరిక

కరోనా ప్రజలను వణికిస్తోందని..మొదటి వేవ్ తర్వాత తగ్గింది అనుకున్నాం..కానీ సెకండ్ వేవ్ ప్రమాదంగా మారిందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉంటోందని..సెకండ్ వేవ్ మొదట హైదరాబాద్ లో మొదలయిందన్నారు. 25 సంవత్సరాలపై బడిన వాళ్లకు వాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరామని.. తెలంగాణలో వాక్సిన్ అయిపోయిందని..వాక్సిన్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇవాళ రాత్రికి 2 లక్షల 7 వేల వాక్సిన్ పంపుతాం అన్నారు..వేచి చూస్తున్నామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా.. ప్రయత్నం చేస్తున్నామన్నారు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ను ప్రభుత్వ ప్రయివేట్ ఆస్పత్రులకు పంపించామని..ఇంజెక్షన్ల విషయంలో అన్ని మాన్యుప్రాక్చర్ లతో మాట్లాడామన్నారు. రేపటి నుంచి రేమిడిసి వీర్ షార్టేజీ ఉండదని. తెలంగాణ లో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా, రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అత్యవసరం గా నియామకం చేసుకునేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు ఈటల.

Related posts