telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో మూడు జిల్లాల్లోనే కరోనా కేసులు అధికం!

karona chekup hospital

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ వరకు 154 కేసులు నమోదు కాగా,  అందులో సగం కేసులు (76) గ్రేటర్ పరిధిలోనే బయటపడ్డాయి. హైదరాబాద్‌ లో 50, రంగారెడ్డి లో 15, మేడ్చల్‌లో 11 కేసులు గుర్తించారు. ఈ మూడు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17)లలో ఎక్కువ ప్రభావం ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇప్పటిదాకా 20 జిల్లాల్లో ఈ  వైరస్ బారిన పడిన రోగులను గుర్తించారు.

తొలుత  విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపించాయి. కొన్ని రోజుల నుంచి స్థానికుల్లోనే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, వారంతా ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. 154 కేసుల్లో దాదాపు సగం మంది మర్కజ్‌ బాధితులే. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 75 మందికి పాజిటివ్ తేలింది. వారి ద్వారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరో 33 మందికి వైరస్ సోకింది. 

Related posts