telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం విక్రయాలు: మంత్రి నారాయణస్వామి

Narayana swamy Minister

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం అమలుచేయనుంది. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖమంత్రి నారాయణస్వామి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్రలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా మద్యనిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే గతనెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించామని చెప్పారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తామని, వీటి ద్వారా 3500 మంది సూపర్‌ వైజర్లు, 8033 మంది సేల్స్ మెన్‌ ఉద్యోగాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Related posts