telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో : ప్రభాస్ “బ్యాడ్ బాయ్”… జాక్వెలిన్ తో ఆ రొమాన్స్ ఏంటి ?

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆగష్టు 18న ‘సాహో’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు భారీస్థాయిలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హాజరయ్యారు. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి “బ్యాడ్ బాయ్” అంటూ కొత్త సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ లో మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పాటుమిగిలిన వారు కూడా ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసారు. ఇక ప్రభాస్ స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఈ పాట “సాహో” సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

Related posts