telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం… కానీ… : గంభీర్

Gautham

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 11,2020) వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్ 50కి పైగా స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 35. ఇక బీజేపీ విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఓటర్ల మనసులు గెల్చుకోలేకపోయారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై గౌతం గంభీర్ స్పందించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అరవింద్ కేజ్రవాల్ నేతృత్వంలోని ఆప్.. ఘోరంగా ఓడించింది. ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ తన బెస్ట్ ఇచ్చింది. కానీ, ప్రజలు దేశ రాజధాని విషయంలో కన్విన్స్ అవలేదని గంభీర్ అన్నాడు. “ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మేం ఒప్పుకుంటున్నాం. అరవింద్ కేజ్రీవాల్‌ను, ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాం. మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాం. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ బాగుపడుతుందని ఆశిస్తున్నా” అని మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ అన్నాడు.

Related posts