తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 25న విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు పాసైనట్టుగా ఆగస్టు మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. వారంతా కంపార్టుమెంట్‌లో పాసైనట్టుగా నిర్దారిస్తారు.